నైజీరియాలో భారత నావికుల కిడ్నాప్

SMTV Desk 2019-05-08 12:09:39  nigeria, indian navy officers, sushma swaraj, foreign afafirs minister

ఆఫ్రికా దేశం నైజీరియాలో భారత్ కు చెందిన ఐదుగురు నావికులు కిడ్నాప్ కు గురయ్యారని విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. నావికులను విడిపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి భారత హైకమిషనర్ ను ఆదేశించారు.

వివరాల్లోకి వెళ్తే...... నైజీరియాలోని బోనీ ఔటర్ నుంచి బయల్దేరిన ఓ ఓడపై సముద్రపు దొంగలు దాడి చేశారు. ఆ సమయంలో ఓడలో మొత్తం 15 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఏడుగురిని దొంగలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అయిన వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో, కిడ్నాప్ కు గురైన వారిలో ఒకరైన సుదీప్ చౌదరీ భార్య భాగ్యశ్రీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇదే సమయంలో తమ వారిని విడిపించాలంటూ కిడ్నాప్ కు గురైన వారి కుటుంబసభ్యులు సుష్మా స్వరాజ్ ను కోరారు. దీనిపై సుష్మా స్వరాజ్ స్పందించడంతో, నైజీరియా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.