నదిలోకి దూసుకెళ్ళిన అమెరిక విమానం...తప్పిన పెను ప్రమాదం

SMTV Desk 2019-05-04 12:38:48  Plane slides off runway into river in Jacksonville, Florida, boing 737

వాషింగ్టన్‌: అమెరికాలో ఓ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. 136 మంది ప్రయాణికులతో క్యూబా నుంచి బయల్దేరిన బోయింగ్‌ 737 కమర్షియల్‌ జెట్‌ ల్యాండింగ్‌ సమయంలో అదుపుతప్పి జాక్సన్‌విల్లేలోని సెయింట్‌ జాన్స్‌ నదిలోకి దూసుకువెళ్లింది. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానం నదిలో మునగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి 9.40 గంటల సమయంలో నావల్‌ స్టేషన్‌ గంటానమో బేలో విమానం ల్యాండ్‌ అవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని నావల్‌ ఎయిర్‌స్టేషన్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారని జాక్సన్‌విల్లే మేయర్‌ ట్వీట్‌ చేశారు. ఈ ప్రమాదంపై జాక్సన్‌విల్లే షరిఫ్స్‌ ఆఫీస్‌ కూడా స్పందించింది. ఈ దుర్ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదని ట్వీట్‌ చేసింది.