విజయ్ దేవరకొండ కూల్ ట్వీట్

SMTV Desk 2017-08-21 17:37:25  arjun reddy, congress leader V.Hanumanth rao, vijay, sandeep reddy vanga, pranai reddy vanga, shalini

హైదరాబాద్, ఆగస్ట్21: పెళ్ళిచూపులు ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కి ప్రేక్షకులనుండి భారీ స్పందన వచ్చింది. తాజాగా ‘అర్జున్ రెడ్డి’ సినిమా పోస్టర్ పై సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు (వీ హెచ్) మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ చిత్రం పోస్టర్లు ఆర్టీసీ బస్ లపై, బస్టాండ్ ల వద్ద ఉన్నాయని, వెంటనే ఆ బస్సును ఆపించి కండక్టర్ సాయంతో ఆ పోస్టర్ ను తొలగించి వేశారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానిపై హీరో విజయ్ దేవరకొండ స్పందిస్తూ తన ట్విట్టర్ లో ‘తాతయ్యా, చిల్’ అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. ఈ చిత్రం సెన్సార్ ఫార్మాల్టీస్ పూర్తి చేసుకొని A సర్టిఫికెట్ అందుకుంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించారు. అర్జున్ రెడ్డి సినిమాలో శాలిని అనే కొత్త అమ్మాయి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.