పబ్‌జీ ఆడనివ్వడంలేదని విడాకులు కోరిన భార్య

SMTV Desk 2019-04-29 15:58:42  wife asked divorce from his husband due to not playing pubg, uae

యూఏఈ: ఓ మహిళా తన భర్త పబ్‌జీ గేమ్ ఆడనివ్వడం లేదని అతనితో ఆమె విడాకులకు సిద్దమయ్యింది. ఈ వింత సంఘటన యూఏఈలోని అజ్మన్‌లో చోటు చేసుకుంది.‘నన్ను నా భర్త పబ్‌జీ గేమ్ ఆడుకోనివ్వడం లేదు. మాకు విడాకులు ఇప్పించండి’ అని సదరు పబ్ జీ ప్రేమికురాలు అజ్మన్ పోలీసుల శాఖకు చెందిన సోషల్ సెంటర్‌కు వెళ్లి కోరింది. ఈ కారణం చేత కూడా విడాకులు తీసుకుంటారా అని ఆశ్చర్యపోయారు? అధికారులు ఆమెను కూర్చొబెట్టి, ఆమె భర్తను పిలిపించి మాట్లాడారు. తన స్వేచ్ఛను భర్త హరిస్తున్నాడని ఆమె అంటుండగా.. ఆమె కుటుంబ బాధ్యతలను సరిగా నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే తాను అలా చేశానని భర్త సమాధానం చెప్పాడు. ఇద్దరికీ సర్దిచెప్పి వాళ్ల కాపురం కొల్లేరు కాకుండా కాపాడటానికి అధికారులకు చుక్కలే కనిపించాయి.