ఈ పాస్ వర్డ్స్ ఉంటే వెంటనే మార్చుకోండి...లేకపోతే!!

SMTV Desk 2019-04-27 19:05:24  accounts passwords, national cyber security center, types of accounts passwords,

హైటెక్: మనకు సంబంధించిన వివిధ రకాల అకౌంట్ల పాస్ వర్డ్స్ దాదాపు మనకు సులువుగు ఉండేలా ఊతపదాలనే ఎక్కువగా పెట్టుకుంటాం. అయితే ఇలా పెట్టడం ద్వారా మన అకౌంట్లు చాలా సులభంగా హ్యాకర్లకు చేతికి వెళ్తుంది అంట. తాజాగా యుకెకి చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (ఎన్ సీఎస్సీ) సర్వే జరిపి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది అకౌంట్ల పాస్ వర్డ్ లను విశ్లేషించి చొరబాటుకు చాలా తేలికగా ఉండే పాస్ వర్డ్ జాబితాను తయారుచేసింది. టాప్ 10లో వివిధ నెంబర్ల కాంబినేషన్లు ఉన్నాయి. "blink182" అత్యంత ప్రజాదరణ పొందిన సంగీత కళాకారుడుగా, "superman" అత్యంత విరివిగా ఉపయోగించే కాల్పనిక పాత్రగా నిలిచారు. వీటన్నిటిలోనూ "123456" అత్యంత ఎక్కువగా ఉపయోగించే పాస్ వర్డ్ గా తేలింది. 23.2 మిలియన్ అకౌంట్లు ఈ పాస్ వర్డ్ ను ఉపయోగిస్తున్నాయి. "123456789" పాస్ వర్డ్ ను 7.7 మిలియన్లు, "qwerty", "password" పదాలను చెరో 3 మిలియన్ల కంటే ఎక్కువ అకౌంట్లు వినియోగిస్తున్నాయి.Ashley, Michael అనే పేర్లు అత్యంత సాధారణంగా వినియోగించే పేర్లుగా గుర్తించారు. ఆ తర్వాత Daniel, Jessica, Charlie ఉన్నాయి. ప్రీమియర్ లీగ్ ఫుట్ క్లబ్ లను పాస్ వర్డ్ లుగా వాడుతున్నారు. వీటిలో లివర్ పూల్ మొదటి స్థానంలో ఆ తర్వాత చెల్సియా, ఆర్సెనల్, మాంచెస్టర్ యునైటెడ్ ("manutd") ఉన్నాయి. మాంచెస్టర్ సిటీ ("mancity") ప్రీమియర్ లీగ్ పాస్ వర్డ్ లలో 11వ స్థానంలో ఉంది. ది డల్లాస్ కౌబాయ్స్ ("cowboys1") అత్యంత జనాదరణ పొందిన NFL టీమ్ నిక్ నేమ్ గా నిలిచింది. వారాల్లో సండే, నెలల్లో ఆగస్ట్ లను ఎక్కువగా పాస్ వర్డ్ లుగా ఉపయోగిస్తున్నారు. ఇక టాప్ టెన్ లో చూసుకుంటే 1. 123456,.....2. 123456789,....3. qwerty,.....4. password,....5. 111111,....6. 12345678,....7. abc123,.....8. 1234567,....9. password1,.....10.12345. ఇక "iloveyou" అనే పదం కొద్దిలో టాప్ 10ను మిస్సైంది. "monkey","dragon" ఆశ్చర్యకరంగా టాప్ 20లోకి వచ్చాయి. చాలా మంది తాము ఎక్కువగా ఉపయోగించే ఊత పదాలను పాస్ వర్డ్ లుగా పెట్టుకుంటున్నారు. ఇలాంటి సులువుగా చొరబడగల పాస్ వర్డ్ లకు బదులుగా మూడు అతి తక్కువగా వాడే, గుర్తుంచుకోదగ్గ పదాలతో పాస్ వర్డ్ పెట్టుకోవాలని ఎన్సీఎస్సీ సూచింది. అలాగే ఉపయోగించిన పాస్ వర్డ్ ను తిరిగి వాడటం చాలా రిస్క్ ఆని తెలిపింది. అత్యంత కీలకమైన డేటాకు రక్షణగా మొదటి పేరు, స్థానిక ఫుట్ బాల్ టీమ్, ఇష్టమైన మ్యూజిక్ బ్యాండ్ వంటి వాటితో పాస్ వర్డ్ ఉపయోగించవద్దని సలహా ఇచ్చింది.