ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం

SMTV Desk 2019-04-26 18:37:48  Fire onboard naval ship INS Vikramaditya , Naval officer dies in fire fighting efforts onboard INS Vikramaditya

బెంగుళూరు: ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో తాజాగా ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కర్నాటకలోని కర్వార్ ఓడ రేవుకు చేరుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది అని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ నావల్ అధికారి మృతిచెందాడు. కంపార్ట్‌మెంట్‌పై అంటుకున్న మంటలను అదుపు చేయడానికి లెఫ్ట్‌నెంట్ కమాండర్ డిఎస్ చౌహాన్ ధైర్యంగా చర్యలు తీసుకున్నట్టు నేవీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మంటలు అదుపులోకి వచ్చే సమయానికి పొగ కారణంగా అధికారికి శ్వాస అందకపోవడంతో అపస్మారకస్థితిలో వెళ్లాడు. తక్షణమే అతన్ని చికిత్స నిమిత్తం నేవీ దవాఖానకు తరలించారు. అప్పటికే అధికారి మృతిచెందినట్లుగా వైద్యులు తెలిపారు. కాగా షిప్‌కు ఎటువంటి నష్టం వాటిల్లకముందే సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తునకు విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.