"టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ" కలెక్షన్లు

SMTV Desk 2017-08-21 10:49:39  toilet movie collections, akshay kumar, bhumi, 100 crores

ముంబై, ఆగస్ట్ 21: బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం "టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ" ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలైన విషయం తెలిసిందే. సామాజిక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులనుండి పాజిటివ్ రేస్పోన్స్ సాధించడమే కాకుండా తొమ్మిది రోజుల్లోనే 107 కోట్ల రూపాయలు వసూళ్లు చేసిందట. ఈ చిత్రానికి యూపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భూమీ పెన్నేకర్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలలో నటించారు.