కొలంబియాలో భారీ వర్షాలు....17 మంది మృతి

SMTV Desk 2019-04-22 19:59:05  Colombia high rains, 17 people died

కొలంబియా: కొలంబియాలో ఆగని భారీ వర్షాల కారణంగా 17 మంది మృతి చెందారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కౌకా ప్రొవిన్స్‌లో కొండచరియలు విరిగి పడి 17 మంది మృతి చెందగా మరొ ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వరదలు రొసాస్‌ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసిన కొలంబియా డిజాస్టర్‌ రిలీఫ్‌ అధికారులు .. నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.