భారత్ పై యుద్దానికి చైనా సన్నాహాల్లో ఉందా...??

SMTV Desk 2017-08-18 15:21:59  chaina, bharath, global times news paper, doklam

బీజింగ్, ఆగస్ట్ 18 : డోక్లాం పరిసర ప్రాంతాలలోని చైనా సైన్యం కదలికలను చూస్తుంటే.. భారత్ తో యుద్ధానికి చైనా సన్నాహాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకనగా చైనా సైన్యం భారీగా రక్తాన్ని సేకరిస్తుంది. ఈ శిబిరం డోక్లాం పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో రక్త వినియోగాన్ని నియంత్రించారు. భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆదేశాల మేరకు ఛాంగ్షాలోని ఆసుపత్రికి చెందిన బ్లడ్ బ్యాంకులను ఇప్పటికే డోక్లాంకు తరలించినట్టు చైనా అధికారిక పత్రిక "గ్లోబల్ టైమ్స్" వెల్లడించింది. గత 30 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది యుద్ధానికి దారి తీయొచ్చని లండన్ రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ కు చెందిన శశాంక్ జోషి విశ్లేషించారు. కాగా ఇటీవల భారత్ డోక్లా౦ విషయంలో ఏడు పాపాలు చేసిందంటూ ఓ వీడియోను పోస్ట్ చేసిన విషయం విదితమే.