చంద్రునిపై ఊరుతున్న నీరు!!!

SMTV Desk 2019-04-16 18:13:25  Meteors slamming into the Moon reveal underground water,Water Released from Moon During Meteor Showers

చంద్రునిపై ఉన్న నీరు ఉల్కలు పడ్డ సమయంలో అవి ఆవిరి రూపంలో బయటికి ఊరుతున్నాయని నాసా మరియు జాన్‌హాప్కిన్స్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చంద్రుడిపై నీరు ఎందుకు బయటకు ఊరుతోందో అనేదానిపై పరిశోధన చేసిన వీరు అంతరిక్షంలో ఉల్కల కారణంగానే చంద్రుడిపై నీరు ఊరుతోందని వెల్లడించారు. ఉల్కపాతం జరిగిన సమయంలో ఆ ఉల్కలు చంద్రుడి పై ఉన్న పొరను బలంగా ఢీకొట్టడంతో ఆ సన్నని పొర చీలి కిందనుంచి నీరు ఊరుతున్నట్లుగా తమ పరిశోధనల ద్వారా బయటపడినట్లు తెలిపారు. కొత్తగా బయటపడిని ఈ విషయం మరిన్ని విషయాలు కనుగొనేందుకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఉల్కల వల్ల చంద్రుడిపై నీరు ఆవిరి రూపంలో బయటకు వస్తున్నట్లు ఇంతకు ముందే గమనించిన శాస్త్రవేత్తలు పూర్తి స్థాయిలో నిర్ధారించలేకపోయారు. అయితే తాజా పరిశీలనలో వారు నీరు ఊరటాన్ని గమనించారు.