సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ వాసి మృతి

SMTV Desk 2019-04-16 14:24:23  south arabia, southa arabia road accident, nijamabad, shake yassin dead in south arabia accident

నిజామాబాద్: సౌదీలోని శుక్రవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌కు చెందిన షేక్ యాసీన్ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధి కో సం వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సుభాష్‌నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం మ్రుతదేహాన్ని తన కుటుంబ సభ్యులకు త్వరితగతిన అప్పజెప్పే విధంగా చేయాలని స్థానికులు కోరుతున్నారు . మృతుడికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు.