ఒకే రాత్రి పది మంది అమ్మాయిలతో....

SMTV Desk 2019-04-16 14:18:24  accountant employee theft 2 crores and enjoyed with ten girls, Britain

బ్రిటన్‌: ఓ బడా కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కంపెనీ నుండి 2 కోట్లు నొక్కేసి ఒకే రాత్రి అంతా ఖర్చు చేశాడు. వివరాల ప్రకారం.... దాదాపు రెండు కోట్ల రూపాయలు నొక్కేసిన ఆ అకౌంటెంట్.. తాను పట్టుబడతానని తెలుసుకుని అప్రమత్తమయ్యాడు. పట్టుబడేందుకు ముందే.. ఆ డబ్బుల్ని ఖర్చు చేయాలనుకున్నాడు. అంతే అనుకున్నంత పని చేశాడు. అంతే ఖరీదైన నైట్ క్లబ్‌లో ప్రైవేట్ రూమ్‌ను బుక్ చేయించుకున్నాడు. ఒక రాత్రంతా ఒకరి తర్వాత ఒకరిగా అమ్మాయిలను పిలిపించుకున్నాడు. ఇలా పదిమందిని పిలిపించుకుని వారితో కలిసి ఖరీదైన డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఉదయం 9 గంటల సమయానికి రెండు కోట్లనూ ఖర్చు చేసేసి తన కారులో ఎంచక్కా ఇంటికి వెళ్లిపోయాడు. ఆపై పోలీసులకు పట్టుబడ్డాడు. జైలులో ఊచలులెక్కిస్తున్నాడు. అతడి పేరు డారెన్. ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. అకౌంటెంట్ కావడంతో ఎలాగూ జీతాల పంపిణీ తన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి, మొత్తం డబ్బును తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. అంత డబ్బుతో పారిపోలేనని భావించి, రాత్రికి రాత్రే జీవితాన్ని మస్తు మజా చేశాడు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు.