అగ్ర రాజ్యాన్ని వణికిస్తున్న బాంబ్‌ తుపాను

SMTV Desk 2019-04-12 19:37:51  Bomb Cyclone, Bomb cyclone attacks the America, Midwest

వాషింగ్టన్‌: అగ్ర రాజ్యం అమెరికా దేశాన్ని బాంబ్‌ తుపాను వణికిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో దక్షిణ డకౌటా ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొలరాడో నుంచి మిన్నెసోటా మధ్య రవాణా వ్యవస్థకు తీవ్ర ఇబ్బందులు ఎర్పడింది. వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల తుపాను వేగంగా బలపడుతుందని అధికారులు వెల్లడించారు. 2 అడుగుల మేర మంచు పేరుకుపోయి ఉంది. దీంతో నెబ్రాస్కా, దక్షిణ డకోటా, విస్కాన్సిస్‌, మిన్నెసోటా వంటి ప్రాంతాలు మంచు ప్రమాదంలో చిక్కుకున్నాయి.