ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు అరెస్ట్

SMTV Desk 2019-04-10 10:57:13  foot ball player, drunk and drive, road accident

ఇంగ్లండ్ , ఏప్రిల్ 10: ప్రముఖ ఫుట్‌బాలర్, చెల్సియా అండ్ ఇంగ్లండ్ మిడ్‌ఫీల్డర్ డేనీ డ్రింక్‌వాటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాగి డ్రైవ్ చేస్తూ ఓ వాహనాన్ని డ్రింక్‌వాటర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడికి గాయాలయ్యాయి. 29 ఏళ్ల ఫుట్‌బాలర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆపై బెయిలుపై విడుదల చేశారు. మే 13న డ్రింక్‌వాటర్ స్టాక్‌పోర్టు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుకావాల్సి ఉంది.

బొల్లింగ్టన్‌ లేన్‌కు చెందిన డ్రింక్‌వాటర్‌ సోమవారం మెర్‌లోని ఆష్లే రోడ్డులో మరో వాహనాన్ని ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ సీజన్‌‌లో డ్రింక్‌వాటర్ చెల్సియా కాంపిటేటివ్ ఫుట్‌బాల్ ఆడడం లేదు. ఇంగ్లండ్ మాజీ మిడ్‌ఫీల్డర్ అయిన డ్రింక్‌వాటర్ ఆగస్టు 2017లో లీసెస్టర్ తరపున ఐదు లీగు మ్యాచుల్లో ఆడేందుకు 35 మిలియన్ పౌండ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.