పుల్వామా దాడి నాకు ముందే తెలుసు!!!

SMTV Desk 2019-04-09 15:34:17  jaish e Chief Masood Azhar, pakistan, india, nissar ahmed, dubai

దుబాయ్‌ లో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జైషేకు చెందిన నిసార్‌ అహ్మద్‌ తాంత్రేను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అతన్ని తాజాగా భారత్‌కు తీసుకొచ్చి విచారించారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెల్లడించారు. పుల్వామా దాడి తనకు ముందే తెలసునని కాని తనకు ఆ దాడికి ఏ సంబంధం లేదని అంగీకరించాడు. పుల్వామా దాడి కేసులో పాక్‌లోని జైషే నాయకత్వ పాత్ర ఉన్నట్లు ధృవీకరించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. జైషే నాయకత్వం ఆదేశాల మేరకే ఈ దాడి నిర్వహించినట్లు ఐతే తనను దాడిలో సహాయం చేయమని దాడి సూత్రధారి ముదస్సిర్‌ ఖాన్‌ కోరాడని తెలిపాడు. 2017లో జరిగిన ఉగ్రదాడిలోనిసార్‌ అహ్మద్‌ కీలక నిందితుడు. ఐతే తనను సోషల్‌ మీడియా ఆప్‌ ద్వారా ముదస్సిర్‌ సంప్రదించాడని, తనకు సాయం చేయాల్సిందిగా కోరాడని విచారణలో తెలిపాడు. కశ్మీర్‌లోని జైషే కార్యకలాపాల్లో నిస్సార్‌ ఆహ్మద్‌ కీలక వ్యక్తి, ఈ స్థాయిలో ఉన్న ఓ కమాండర్‌కి పుల్వామా దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే ఉంటాయి. ఇంకా విచారణ కొనసాగాల్సి ఉంది. ముఖ్యంగా దాడి జరగడానికి రెండు వారాల ముందు దుబాయ్‌ పారిపోవటం పలు అనుమానాలకు దారి తీస్తుందని ఓ ఎన్‌ఐఏ అధికారి తెలిపారు.