మాన్నెకెన్-పిస్ విగ్రహానికి మరమ్మత్తులు

SMTV Desk 2019-04-09 13:21:29  Brussels , Manneken Pis (little pee man in Flemish), Brussels, Belgium, Menneken Pis

బెల్జియం: పర్యాటకులను ఆకర్షించే కలాఖండాల్ల్లో ఒకటి మాన్నెకెన్-పిస్ (మూత్ర విసర్జన చేసే బాలుడి కాంస్య విగ్రహం). 400 ఏళ్లనాటి ఈ విగ్రహం బెల్జియంలోని బ్రస్సెల్స్ నగరంలో ఉంటుంది. దీని నుండి రోజుకు 2.5 టన్నుల నీరు వృథాగా డ్రైనేజీలో కలిసిపోతోంది. బెల్జియంలో రోజుకు ఐదు కుటుంబాలు ఉపయోగించుకునే నీటితో ఇది సమానం. ఆ విగ్రహంలో అమర్చిన పైపుల్లో లోపం తలెత్తడం వల్లే నీరు వృథాగా పోతోంది. ఆ లోపాన్ని బ్రస్సెల్స్ అధికారులు ఇటీవలే గుర్తించారు. నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇకపై ఆ నీటిని రీసైకిల్ చేసేలా చర్యలు తీసుకోవడం ద్వారా వృథాను అరికట్టనున్నట్టు నగర ఇంజినీర్ రెగిస్ కల్లెన్స్ తెలిపారు. 1619లో పోతపోసిన ఈ విగ్రహం చోరీకి గతంలో పలు ప్రయత్నాలు జరిగాయి. దీంతో చాలా కాలం క్రితమే అసలు విగ్రహాన్ని మ్యూజియంలో భద్రపరిచి పర్యాటకుల కోసం నకలు విగ్రహాన్ని అదే చోట ఏర్పాటు చేశారు.