గే కొడుకు కోసం మరో సారి తల్లి అయ్యింది...

SMTV Desk 2019-04-04 16:18:12  america, Woman gives birth to her own granddaughter

అమెరిక : అమెరికాలోని నెబ్రస్కాలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన కొడుకు గే అవడంతో అతని కోసం మరోసారి తల్లి అయ్యింది. పూర్తి వివరాల ప్రకారం...సెసిల్ ఎలెగ్ (61) అనే మహిళ ఒక్కగానొక్క కొడుకు మాథ్యూ. అతుడు స్వలింగ సంపర్కుడు. ఇలియట్ డౌఘెర్టీ అనే మరో పురుషుడిని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరు ఓ బిడ్డను కనాలనుకున్నారు. ఆ విషయాన్ని మాథ్యూ తన తల్లితో చెప్పాడు. దీంతో వైద్యులను సంప్రదించారు. ‘గే’ జంట పిల్లలను కనడం అసాధ్యం కనుక వైద్యులు వీలుకాదన్నారు. బిడ్డ సంతోషం కోసం సరోగసీ విధానంలో మరో బిడ్డను కనేందుకు తన తల్లి ముందుకొచ్చింది. కానీ, అప్పటికే ఆమెకు 61 ఏళ్లు నిండాయి. ఆ వయసులో పిల్లలను కనడం అసాధ్యం అవుతుండొచ్చని భావించారు. కానీ వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి పిల్లలను కనొచ్చని భరోసా ఇచ్చారు. మాథ్యూ నుంచి వీర్యం, అతని భర్త ఇలియట్ సోదరి నుంచి అండాన్ని సేకరించిన వైద్యులు సెసిల్ గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. తొమ్మిది నెలల తర్వాత ఆమె ఒమాహాలోని నెబ్రస్కా మెడికల్ సెంటర్‌లో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఒక మహిళ సరోగసి విధానంలో మనవరాలికి జన్మనివ్వడం ప్రపంచంలో ఇదే తొలిసారి అవడం విశేషం.