రెండు నెలలు హాయిగా నిద్రపోతే రూ.13 లక్షలు!

SMTV Desk 2019-03-31 16:21:39  :NASA Will Pay You Rs 13 Lakh To Sleep In Bed, NASA, esa,

మార్చ్ 31: నాసా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బెడ్ మీద రెండు నెలల పాటు హాయిగా నిద్ర పొతే రూ.13 లక్షలు ఇస్తుందంట. యురోపియన్ స్పేస్ ఏజన్సీ (ESA)తో కలిసి నాసా సంస్థ ఆర్టిఫిషియల్ గ్రావిటీ (కృత్రిమ గురుత్వాకర్షణ)పై అధ్యయనం జరుపుతున్న ఈ ప్రక్రియ క్రమంలో మనుషులు నిద్రపోతున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఎంత ఉంటుందో తెలుసుకునేందుకు పరిశోధనలు జరుపుతోంది. అంతరిక్ష‌ వాతావరణంలో వ్యోమగాములకు మరింత సౌకర్యాన్ని అందించేందుకు నాసా తొలిసారిగా ఈ ప్రయోగం చేపడుతోంది. ఈ సందర్భంగా 24 నుంచి 55 ఏళ్ల వయస్సు గల 12 మంది పురుషులు, 12 మంది మహిళలు అవసరమని నాసా పేర్కొంది. వీరు రెండు నెలలపాటు బెడ్ మీద నిద్రపోతే చాలు. ఇందుకు నాసా వారికి రూ.12.81 లక్షలు చెల్లిస్తుంది. ఈ స్టడీ జరుగుతున్నప్పుడు వాలంటీర్లు ఎవరూ బయటకు వెళ్లకూడదు. కృత్రిమ గురుత్వాకర్షణలో వారి జ్ఞాపక‌శక్తి, కండరాల సామర్థ్యం, గుండె పనితీరు వంటి అంశాలను తెలుసుకుంటారు.