జంతువుల మధ్యలో కన్నతండ్రి... 96 ఏళ్ల వృద్ధుడి కూతుళ్ళ నిర్వాకం

SMTV Desk 2019-03-25 18:30:00  old man two daughters, california

కాలిఫోర్నియా, మార్చ్ 25: కాలిఫోర్నియాలోని ఓ వృద్దుడి కూతుళ్ళు అతని పట్ల చాలా కఠినంగా ప్రవర్తించారు. ఇంటినిండా జంతువులను సాదుకుంటూ వాటితో తన తండ్రిని కూడా కలిపేశారు. పూర్తి వివరాల ప్రకారం...వెంచురా కౌంటీ ఏరియాలో 96 ఏళ్ల వృద్ధుడితో పాటు కలిసి ఉంటున్నారు అతని ఇద్దరు కూతుళ్లు. అయితే తాజాగ ఆ ఏరియాలో ఉంటున్న పౌరుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రతి ఇంటికీ తిరుగుతూ వివరాలు సేకరిస్తూ వృద్ధుడు ఉన్న ఇంటి తలుపు తట్టారు అధికారులు. ఆయన 65 ఏళ్ల చిన్న కూతురు వచ్చి తలుపు తీసింది. అయితే ఆమె అధికారులను లోపలికి రావడానికి అనుమతించలేదు. ఆ తర్వాత 74 ఏళ్లున్న పెద్ద కూతురు బయటకు వచ్చి లోపలికి రావడానికి వీల్లేదని ఖరాఖండిగా చెప్పింది. ఇంతగా అడ్డు చెబుతున్నారంటే లోపల ఏదో ఉందని అధికారులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి లోపల ఉన్న వృద్ధుడి పరిస్థితిని చూసి షాకయ్యారు. ఇంటినిండా జంతువులు, పక్షులు కనిపించాయి. కుక్కలు, కుందేళ్లు, పిల్లులు, చిలుకలు, అదవి ఎలుకలు.. ఇలా రకరకాల జంతువులను బోనులో పెట్టి పెంచుతున్నారు ఆ అక్కాచెల్లెలు. దాదాపు 700 ఎలుకలు ఇంట్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అతడి ఒంటిపై ఉన్న బట్టలు చిరిగి పోయి దీనస్థితిలో ఉన్నారు. పోలీసులు మరి కొందరి సహకారంతో బోనులో ఉన్న జంతువులను జంతు సంరక్షణాధికారులకు అప్పగించారు. వృద్దుడిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇద్దరు కూతుళ్లను అదుపులోకి తీసుకున్నారు.