వెబ్ సిరీస్ లోకి ధనుష్ !

SMTV Desk 2017-08-10 14:33:02  dhanush, web series, direction,

ముంబై, ఆగస్ట్ 10 : ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో మంచి కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న హీరో ధనుష్ కి నటుడిగానే కాకుండా, మంచి దర్శక నిర్మాతగా కూడా అనుభవముంది. అయితే తాజాగా ధనుష్ వెబ్ సిరీస్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం. కాగా గత రెండు సంవత్సరాల క్రితమే ఆయన వెబ్ సిరీస్ కి దర్శకత్వం చేయాలనుకున్నాడట. కాని అప్పుడున్న పరిస్థితుల వల్ల అది సాధ్యపడలేదు. ఇంతలో ఆయన దర్శకత్వంలో వచ్చిన "పా పాండి" చిత్రం మంచి హిట్ కావడంతో తన మీద తనకు నమ్మకం పెరిగిందట. ఆ సినిమా ఇచ్చిన నమ్మకంతోనే తను ఒక వెబ్ సిరీస్ ను మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రచయితల బృందాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ నుండి కంటెంట్ ను రాబట్టే ప్రయత్నంలో వున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో ధనుష్ నటించడం లేదట కేవలం దర్శకత్వం మాత్రమే చేయనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్ట్ ను వచ్చే ఏడాది పట్టాలేక్కించే అవకాశాలున్నట్లు సమాచారం.