కాంగోలో రైలు ప్రమాదం...24 మంది మృతి

SMTV Desk 2019-03-19 12:18:24  cango, train accident, 24 mens died

కాంగో, మార్చ్ 18: కాంగోలోని కసాయ్‌ ప్రావిన్స్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 24 మంది మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక మృతుల్లో చాలామంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. అనేక మందికి తీవ్ర గాయలయ్యాయి. పట్టాలు తప్పడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత అధికారులు చెపుతున్నారు. కాగా ఈ క్రమంలో కొన్ని బోగీలు పక్కనే ఉన్న నదిలో పడ్డాయని తెలిపారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.