ప్రాణాలను కాపాడిన ఐఫోన్

SMTV Desk 2019-03-15 12:16:40  man life saves his iphone, iphone, australia, new south wales

ఆస్ట్రేలియా, మార్చ్ 15: ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో ఓ వ్యక్తి ప్రాణాలను తన ఫోన్ కాపాడింది. నింబిన్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి ముందు నిల్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి అతనిపై బాణంతో దాడి చేయడానికి సిద్ధంకాగా అతని ఫొటో తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ బాణం నేరుగా బాధితుడి ఐఫోన్ కు తగిలింది. ఒకవేళ ఆ ఫోన్ లేకపోయుంటే బాణం బాధితుడి తలలోకి చొచ్చుకెళ్లిపోయేది. బాణం వేగంగా దూసుకురావడంతో బాధితుడి మొఖంపై స్వల్ప గాయమైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. బాణం మొబైల్ నుంచి చొచ్చుకెళ్లిన ఫొటోను కూడా షేర్ చేశారు.