మార్స్ పై మొదట అడుగుపెట్టేది మహిళనే

SMTV Desk 2019-03-14 09:30:37  mars, earth, moon, nasa

మార్చ్ 13: నాసా మార్స్ పై మానవుడు జీవించడానికి అవకాశం ఉందా లేదా అన్న దానిపై ప్రస్తుతం పరిశోధనలు చేస్తుంది. కాగా ఇందులో భాగంగా మార్స్ పైకి వెళ్ళేది ఓ మహిళే అని నాసా అడ్మినిస్ట్రేటర్‌ జిమ్‌ బ్రైడెన్‌ రైస్టెన్‌ తెలిపారు. అలాగే మరోసారి చంద్రుడిపై కాలుమోపే వ్యక్తి కూడా మహిళే అన్నారు. ఆ మహిళ ఎవరు అన్నది ఖచ్చితంగా చెప్పలేకపోయినా.. రాబోయే ప్రాజెక్టులన్నిటిలో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఈ నెల చివర్లో తొలిసారిగా కేవలం మహిళా ఆస్ట్రోనాట్లు మాత్రమే స్పేస్‌వాక్‌ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తూ.. ఏడు గంటల పాటు సాగే ఈ స్పేస్‌వాక్‌కు, 2013లో ఆస్ట్రోనాట్స్‌గా శిక్షణ తీసుకున్న ఆనె మెక్‌క్లెయిన్‌, క్రిస్టినా కోచ్‌ సిద్ధమవుతున్నారని, అంతేకాక.. ఈ మధ్య నాసా నిర్వహిస్తున్న స్పేస్‌ క్లాసులకి ఎక్కువ సంఖ్యలో మహిళలే వస్తుండటం విశేషం అని పేర్కొన్నారు.