అక్టోబర్‌లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిఖిల్

SMTV Desk 2017-08-08 12:03:26  nikil, happy days, karthikeya, sharan koppisheti, thejeswini, anjaneyulu yadav

హైదరాబాద్, ఆగస్ట్ 8: హ్యాపీ డేస్ తో తెలుగు సినిమాలలో హీరోగా అడుగుపెట్టిన హీరో నిఖిల్. "కార్తికేయ" ,"ఎక్కడికి పోతావు చిన్నవాడా" వంటి వరుస సక్సెస్‌లతో టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ యువనటుడు త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే నిఖిల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. నిఖిల్ తో పాటు పెళ్లి పీటలు ఎక్కబోతున్న అమ్మాయి ప్రముఖ వ్యాపారవేత్త ఆంజనేయులు యాదవ్ కుమార్తె తేజస్వినట. ఆగష్టు 24న నిశ్చితార్థం, అక్టోబర్‌లో పెళ్లి వేడుక జరిపేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.