బాలాకోట్ దాడి గురించి నిజాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షులు!

SMTV Desk 2019-03-13 12:30:23  balakot attack, indian airforce, central government, pakistan terrorists

ఇస్లామాబాద్, మార్చ్ 12: బాలాకోట్ లో భారత వైమానిక దళాలు చేసిన దాడిలో మరో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ దాడి జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భారత వైమానిక దళం ఉగ్ర శిబిరాలపై బాంబులు జారవిడిచిన తరువాత పాకిస్తాన్‌ ఆర్మీ రంగంలోకి దిగిందని, ఉగ్రవాదుల మృతదేహాల్ని కాల్చివేసి సమీప నదిలో పడేశారని అన్నారు. ఆధారాల్ని మాయం చేసేందుకు బాలాకోట్‌ గ్రామానికి వచ్చిన పాకిస్తాన్‌ ఆర్మీ... ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసిందన్నారు. అంతేకాక అక్కడ ఉన్న వారి ఫోన్లను ఆర్మీ వారు లాక్కున్నారని చెప్పారు. దాడికి సంబంధించి ఎలాంటి వీడియోలు, ఫొటోలు బయటికి రాకుండా ఇంటర్నెట్‌ సేవల్ని కూడా నిలిపేశారని గాయపడిన ఉగ్రవాదుల పట్ల పాకిస్థాన్‌ ఆర్మీ అమానవీయంగా ప్రవర్తించిందంటున్నారు. కార్ల నుంచి తీసిన పెట్రోల్‌తో శవాల్ని మూకుమ్మడిగా తగలబెట్టారన్నారు. ఇక బాలాకోట్‌ దాడి తరువాత ఉగ్రవాదులకు భయం పట్టుకుందని, వారంతా అఫ్గానిస్తాన్‌–వజీరిస్తాన్‌ సరిహద్దులోకి పారిపోయారని చెప్పారు.