ఆయిల్‌ట్యాంకర్ ను ఢీకొట్టిన ఫిషింగ్ బోటు

SMTV Desk 2019-03-12 16:12:00  Hong Kong, Oil tanker explosion, Explosion, fire on tanker, 1 dead 3 missing

హాంకాంగ్, మార్చ్ 12: హాంకాంగ్ సముద్ర తీరంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్, ఫిషింగ్ బోటు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆయిల్ ట్యాంకర్ ధాటికి చేపల వేటకు వెళ్లిన నౌక మునిగి పోయింది. అయితే ఆయిల్ ట్యాంకర్‌పై ఉన్న 13 మంది సురక్షితంగా బయట పడ్డారు. కాని ఫిషింగ్ బోటులో ఉన్నవారు ఎవరైనా గల్లంతయ్యారనేది తెలియాల్సి ఉంది. రెస్యూ టీం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తుందని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.