పెప్పర్ స్ప్రేతో హళ్ చల్ చేస్తోన్న మహిళ

SMTV Desk 2019-03-11 07:39:05  pepper spary, america, police

అమెరికా, మార్చ్ 10: అమెరికాలో ఓ మహిళా పెప్పర్ స్ప్రేతో చెలరేగిపోయింది. రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న వారిపై ఆమె పెప్పర్ స్ప్రే తో దాడి చేస్తుంది. పూర్తి వివరాల ప్రకారం...ఫుట్ పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను కాలుతో తన్నింది. ఆపై మళ్లీ వెనకకు వచ్చి ఆమె పక్కన ఉన్న మరోకతనిపై పెప్పర్ స్ప్రే చల్లింది. అంతటితో ఆగకుండా మరికొందరిపై ఆ మహిళ పెప్పర్‌ స్ప్రేతో దాడి చేసింది. దాడికి గురైన ఏడుగురు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన మహిళ పేరు థామస్‌‌గా(30) గుర్తించినట్లు తెలిపారు హార్లెమ్‌ అధికారులు. ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఆమె ఈ చర్యకు పాల్పడిందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.