భారత్ ఎకో టెర్రరిజానికి పాల్పడుతోందంటూ ఫిర్యాదులు!

SMTV Desk 2019-03-09 18:20:06  Prime Minister on Climate Change Malik Amin Aslam ,Environment, indian airforce, pakistan government, united nations

ఇస్లామాబాద్ మార్చ్ 09: భారత వైమానిక దళాలు పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో బాలాకోట్ లోని అనేక చెట్లు నేలకూలాయని పాక్ అటవీ శాఖా భారత పైలట్లపై కేసు కూడా పెట్టింది. కాగా ఈ దాడుల గురించి ప్రస్తావించిన పాక్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ మాలిక్ అమీన్ మాట్లాడుతూ…పర్యావరణ ఉగ్రవాదానికి ఇదొక ఉదాహరణ అన్నారు. బాలాకోట్ లో డజన్ల కొద్దీ పైన్ చెట్లు నేలకూలాయని..దాడులతో పాక్ ఎంతో నష్టపోయిందన్నారు. ఇక భారత్ ఎకో టెర్రరిజానికి పాల్పడుతోందంటూ ఐక్యరాజ్యసమితిలో కూడా పాకిస్తాన్ ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా అంతర్జాతీయ సమాజంలో భారత్ పరువు తీయొచ్చనే కుట్రలు పన్నుతోంది.