గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకున్న బ్యాచిలర్స్....

SMTV Desk 2019-03-08 18:56:24  Arnon Rodthong, with his daughter, Karnista

థాయ్‌లాండ్‌, మార్చ్ 08: థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మిలియనీర్ ఆర్నాన్ రోడాంగ్ ప్రపంచంలోని పెళ్లి కాని అబ్బాయిలందరికీ ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. తన కూతురు కర్నిస్టాను పెళ్లి చేసుకునేందుకు ఓ అబ్బాయి కావాలంటూ ఓ ప్రకటన వేశాడు. అంతేకాదు పెళ్లి చేసుకుంటే రెండు కోట్ల రూపాయలతో పాటు వ్యాపారంలో వాటా కూడా ఇస్తానంటూ ప్రకటించాడు. అబ్బాయి ఎంత వరకు చదువుకున్నా పర్లేదని, కష్టించి పనిచేసే తత్వం ఉంటే చాలని అంటున్నాడు. ఆసక్తి గలవారు తనను సంప్రదించాలని కోరాడు. తన కూతురి కోసం చాలా సంబంధాలు చూసినా వచ్చిన అబ్బాయిల్లో ఎవరూ తనకు నచ్చకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అర్నాన్‌ చెప్పుకొచ్చాడు. తన కోసం తండ్రి ఇలాంటి ఒక ప్రకటన ఇవ్వడం చూసి కుమార్తె ఎంతో సంతోషిస్తుంది. నాన్న చెప్పినట్లుగా తనకు కూడా కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తే భర్తగా కావాలని కోరుకుంటున్నట్లు చెబుతోంది. కాని ఇలా ప్రకటన పెట్టిన కొన్ని రోజులకే కొన్ని వేల మంది అతనికి ఫోన్లు చేయడంతో విసుగెత్తి ఈ ప్రకటనను క్యాన్సేల్ చేశాడు. దీన్ని బట్టి చూస్తె బ్యాచిలర్స్ కు ఇది మిస్ అయిన గోల్డెన్ చాన్స్ అని చెప్పుకోవచ్చు.