ఆస్ట్రేలియాలో తెలుగు యువతి దారుణ హత్య : సూట్ కేస్ లో డెడ్ బాడీ!

SMTV Desk 2019-03-07 12:12:39  australia, indian, preeti reddy, dentist, murder, missing case, sydney police

ఆస్ట్రేలియా, మార్చ్ 06: ఆస్ట్రేలియాలో తెలుగు యువతి డెంటిస్ట్‌ ప్రీతి రెడ్డి(32) మిస్సింగ్‌ కేసు విషాదంగా ముగిసింది. ఈ నెల 3 నుంచి కనిపించకుడా పోయిన ప్రీతిరెడ్డి ఊహించని విధంగా ఈ రోజు సూట్‌ కేస్‌ లో శవమై కనిపించింది. సౌత్‌ ఈస్ట్‌ కింగ్స్‌ పోర్డ్‌ లో డాక్టర్‌ కారు డిక్కీలో డెడ్‌ బాడీని గుర్తించారు పోలీసులు. చివరిసారిగా సిడ్నీ జార్జ్ స్ట్రీట్ లోని మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ వద్ద కనిపించిన ప్రీతి..ఆ తరువాత మిస్‌ అయిందంటూ పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చారు ఫ్యామిలీ మెంబర్స్‌. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన సిడ్నీ పోలీసులు..ఎట్టకేలకు డెడ్‌ డాడీని గుర్తించారు.