పిడుగు పాటుకు దహనమైన ఆస్ట్రేలియా అడవులు

SMTV Desk 2019-03-02 17:47:00  Australia, Victoria state, Ban pay national park, Lightening thunders, forest

విక్టోరియా, మార్చ్ 2: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని ఓ పార్క్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం బన్‌యిప్‌ జాతీయ పార్కులో పిడుగు పడి ఒక్కసారిగా మంటలు చెలరేగి అక్కడి అడవులను దహించి వేశాయి. పార్కు సహా తూర్పు ప్రాంతంలోని అడవులు కార్చిచ్చు ధాటికి బూడిదగా మారుతున్నాయి. ఇప్పటికి మంటలను అదుపు చేయడానికి దాదాపు 300 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది శ్రమిస్తున్నారు. అగ్నికి గాలి తోడవడంతో మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారింది. బలమైన గాలుల కారణంగా మంటలు వేర్వేరు దిశలకు మరింతగా విస్తరిస్తున్నాయి. మంటలను నియంత్రించేందుకు హెలికాఫ్టర్ల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.