జైషే మహ్మద్‌ సంస్థ ప్రతినిధులు మాతో టచ్‌ లో ఉన్నారు : పాక్

SMTV Desk 2019-03-02 16:18:55  Federal Minister for Foreign Affairs, Shah Mehmood Qureshi, Pakistan, Pulwama attack, Jai she mohammed

ఇస్లామాబాద్, మార్చ్ 2: పాక్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషి పుల్వామా దాడి విషయంలో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ ను మరోసారి వెనకేసుకొచ్చారు. పుల్వామలో దాడి చేసింది జైషే మహ్మద్‌ సంస్థ కాదని.. స్పష్టం చేశారు. జైషే మహ్మద్‌ సంస్థ ప్రతినిధులు తమతో టచ్‌ లో ఉన్నారని.. భారత్‌ సరైన ఆధారాలు చూపించలేదని పేర్కొంది. ఒకవేళ సరైన ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకుంటామని ఖురేషీ స్పష్టం చేశారు. జైషూ మహ్మద్‌ సంస్థతో సంబంధాలు ఉన్నాయంటున్న పాక్‌ ప్రభుత్వం…, రెండు దేశాల మధ్య శాంతి కోసం చర్చలకు సిద్ధమని మంత్రి మహ్మద్‌ ఖురేషీ ప్రకటించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని మంత్రి అన్నారు.