హంజాబిన్ లాడెన్‌ ఆచూకి చెబితే 1 మిలియన్ డాలర్లు

SMTV Desk 2019-03-01 18:26:15  Osama Bin Laden, Hanja Bin Laden, Terrorist, Gift Price, America

వాషింగ్టన్, మార్చి 1: ఉగ్రవాది, అల్‌ఖైదా నేత ఒసామా బిన్ ఒకప్పుడు అగ్రరాజ్యానికి తీవ్ర నష్టం కలిగించాడు. తాజాగా అతని కొడుకు హంజాబిన్ లాడెన్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా అమెరికా ప్రకటించింది. కేవలం 20 ఏళ్ల వయసున్న హంజాబిన్ లాడెన్‌ పై సెక్షన్ 1 కింద ఆంక్షలు విధించింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (ఈఓ) 13224 ప్రకారం అమెరికా భద్రత కోసం హంజాబిన్ తో లావాదేవీలు జరపడాన్ని నిషేధించారు. కాగా, అతని ఆచూకి తెలిపినవారికి భారీ ఆఫర్ అంటూ ప్రకటించింది. హంజా బిన్ లాడెన్ ఆచూకీ చెబితే మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తామని అమెరికా తెలిపింది. అల్ ఖైదా నాయకుడు హంజా బిన్ లాడెన్ పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో లేదా ఇరాన్ దేశంలో ఉండవచ్చని అమెరికా అనుమానం వ్యక్తం చేస్తుంది.