తమన్నా 'ది ఐటం బాంబ్'

SMTV Desk 2019-02-27 17:48:38  Tamnanah Bhatia

సౌత్ హీరోయిన్స్ లో అందరిది ఒకదారి అయితే మిల్కీ బ్యూటీ తమన్నాది మరోదారి. దశాబ్ధ కాలంగా స్టార్ హీరోయిన్ గా కెరియర్ సాగిస్తున్న తమన్నా ఈమధ్య కొద్దిగా వెనకపడ్డట్టు అనిపిస్తుంది. హీరోయిన్ గానే కాదు ఐటం సాంగ్స్ కు తమన్నా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. కేవలం డబ్బు కోసమే తమన్నా ఐటం సాంగ్స్ చేస్తుందని చాలామంది విమర్శిస్తారు. రీసెంట్ గా కన్నడ స్టార్ యశ్ నటించిన కె.జి.ఎఫ్ సినిమాలో కూడా తమన్నా ఐటం సాంగ్ చేసింది.

సినిమా అయినా ఐటం సాంగ్ అయినా మనసుకి నచ్చే చేస్తా అంటున్న తమన్నా సినిమాకు కష్టపడినట్టే.. స్పెషల్ సాంగ్ కోసం కష్టపడుతా.. అందులోనూ సంతృప్తి చెందుతా అంతేకాని కేవలం డబ్బు కోసం ఐటం సాంగ్స్ చేయట్లేదని అంటుంది. అయినా మన దారిలో మనం వెళ్తున్నప్పుడు మనల్ని పొగిడినా విమర్శించినా అది వారి అభిప్రాయం అని లైట్ తీసుకోవాలి. అలా మిల్కీ బ్యూటీ తాను ఐటం సాంగ్స్ చేసినా చాలా సంతృప్తిగా ఉంటానని చెబుతుంది. సో చూస్తుంటే ఇక మీదట కూడా ఐటం సాంగ్స్ తో అదరగొట్టడం ఖాయమని చెప్పకనే చెబుతుంది అమ్మడు.