పాక్ వద్ద ఉన్నది భారత పైలెట్ వర్థమాన్ అభినందనేనా...!

SMTV Desk 2019-02-27 17:17:22  Pulwama attack, Bharath Surgical strike, Airforec india, Pakistan Terrorists, Indian army, Pakistan president, Imran khan, Pilot, Vardaman abhinandan, Pakistan

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: బాలాకోట్‌లో భారత్ విమాన దళాలతో జరిపిన దాడులకు ప్రతిగా ఈరోజు ఉదయం పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానాలు భారత గగనతంలోకి వచ్చి దాడికి ప్రయత్నించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి రవీష్‌కుమార్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాక్‌కు చెందిన ఓ ఎఫ్16 విమానాన్ని కూల్చినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ గందరగోళంలో ఓ మిగ్21 ఫైటర్ జెట్ కనిపించకుండా పోయిందని ఆయన చెప్పారు. అందులోని పైలట్ కూడా వెనక్కి రాలేదని తెలిపారు. కాగా ఆ పైలట్ తమ ఆధీనంలో ఉన్నట్లు అంతేకాక అతని పేరు వర్థమాన్ అభినందన్ గా పాక్ అధికారులు వెల్లడించారు. కాని భారత విమాన దళాల అధికారులు మాత్రం ఇంకా ఆ పైలట్ పై ఎటువంటి సంచారం బయటపెట్టలేదు. ఇక దీనికి సంబంధించినదిగా చెబుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియోలోని వ్యక్తి భారత వాయుసేన దుస్తులను ధరించి ఉన్నాడు. తన పేరు వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ అని ఆ వ్యక్తి వెల్లడిస్తున్నాడు. అతని చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. పాక్‌ యుద్ధ విమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. అభినందన్ తండ్రి కూడా వాయుసేన అధికారే.