చైనా సహాయం కోరిన పాక్, నిరాకరించిన చైనా!

SMTV Desk 2019-02-26 13:11:12  China, Pakisthan, Help, Rejected, Attack

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 26: భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ తో పాకిస్తాన్ కు భయం చుట్టుకుంది. పాక్ వెంటనే చైనాను సంప్రదించింది. భారత వాయుసేన విమానాలు దాడి చేసి వెనక్కు వెళ్లిపోయిన వెంటనే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మఖ్దూమ్ షా మహమ్మద్ ఖురేషీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ వార్తను స్వయంగా చైనా ప్రభుత్వ రంగ అధికార వార్తా సంస్థ క్సిన్హువా ప్రకటించింది. భారత సైన్యం నిబంధనలకు విరుద్ధంగా వాస్తవాధీన రేఖను దాటి ముజఫరాబాద్ సెక్టార్ లోకి ప్రవేశించాయని చైనాకు ఫిర్యాదు చేసిన పాక్ మంత్రి, తిరిగి దాడులు చేసేందుకు సహకరించాలని కోరగా, చైనా అందుకు అంగీకరించలేదని తెలిసింది. భారత యుద్ధ విమానాలను పసిగట్టిన పాక్ ఎయిర్ ఫోర్స్ కౌంటర్ ఫైటర్ దళాలు, వాటిని తరిమేశాయని మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.