పాకిస్తాన్ కి మొదలైన భయం; మాట మార్చిన ప్రధాని

SMTV Desk 2019-02-25 16:17:51  pakistan, pakistan pm, imran khan, pulwama attack

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: పుల్వామా ఉగ్రదాడి భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణాన్ని సృష్టించింది. ఈ దాడికి పాకిస్థాన్ కారణమని భారత్ ఆరోపిస్తుండగా ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదని పాక్ పేర్కొంది.

అంతేకాదు భారత్ యుద్దానికి వస్తే గట్టి సమాధానం చెప్పడానికి వెనుకాడమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీడియా ముందుకి వచ్చి చెప్పారు. దీంతో భారత్ లో ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయి, జనం కోపోదృక్తులయ్యారు. పాకిస్తాన్ కి బుద్ది చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

దీంతో మోదీ సైతం పాకిస్థాన్ పై మాటలతో విరుచుకుపడుతూ పరోక్ష హెచ్చరికలు పంపారు. కాగా మరికొన్ని దేశాలు భారత్ తరపున మాట్లాడి పాకిస్తాన్ ను అన్ని విధాలా ఒంటరిని చేయాలని మాట్లాడాయి. దీంతో పాక్ పాలకుల్లో భయం పుట్టుకొచ్చింది. ఉన్నట్టుండి మాట మార్చిన ఇమ్రాన్ ఖాన్....... ఆధారాలు చూపితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు.

ఇక పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషి అయితే పాక్ శాంతిని కోరుకుంటోందని, కావాలనే భారత్ యుద్ద వాతావరణాన్ని సృష్టిస్తోందని అంటూ, ఐకాస కలుగజేసుకుని పరిస్తితిని చక్కదిద్దాలని కోరడం గమనార్హం.