టమాటాలు ఇవ్వకపోతే బాంబులు విసురుతామన్న పాక్....

SMTV Desk 2019-02-25 13:15:06  Pakisthan, Tomatos, Journalist, Narendra Modi, Rahul gandhi

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 25: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ తో అన్ని సంబంధాలు తెంచుకుంది. పాక్ పట్ల ఆగ్రహం తో ఉన్న భారత సరిహద్దు వ్యాపారులు, పాకిస్థాన్‌కు టమాటాల సరఫరాను నిలిపివేశారు. దీంతో ఆ దేశంలో టమాటాల సంక్షోభం ఏర్పడింది. అవి దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉన్న కొద్దిపాటి టమాటాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కిలో ఏకంగా రూ. 300 పైనే పలుకుతోంది.

భారత వ్యాపారులు టమాటాల నిలిపివేతపై పాక్‌లోని సామాన్య ప్రజలే కాకుండా ఆ దేశ జర్నలిస్టులు కూడా మండిపడుతున్నారు. టమాటాల ఎగుమతిని ఆపేసిన భారత్‌పై అణుబాంబు వేయాలని లాహోర్‌లోని సిటీ 42 టీవీ జర్నలిస్టు ఒకరు ఆక్రోశం వ్యక్తం చేశాడు. టమాటాల సరఫరా నిలిపివేసినందుకు ప్రతిగా భారత ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ ముఖాలపై టమాటాలు విసిరికొట్టాలని మండిపడ్డాడు. తప్పైపోయిందని భారత్ వెయ్యిసార్లు అనేలా చేస్తామని హెచ్చరించాడు.