ఎక్స్‌రే స్కానింగ్ మెషీన్‌లో దూరి స్కాన్ చేసుకున్న చిన్నారి...

SMTV Desk 2019-02-23 17:16:22  China, Railway station, Luggage bag x ray scanner, Chinese girl climbs through baggage X-ray machine

చైనా, ఫిబ్రవరి 23: చైనాలోని ఓ రైల్వేస్టేషన్ లో ఓ బాలిక లగేజీ బ్యాగును స్కాన్ చేసే మెషీన్‌లోకి వెళ్లి స్కాన్ అయ్యి బయటకు వచ్చింది. ప్రమాదవశాత్తు ఆ బాలికకు ఏ అపాయం జరుగలేదు. పూర్తి వివరాల ప్రకారం తూర్పుచైనా, షాండాంగ్ ప్రావిన్స్‌లోని డమింఘు రైల్వేస్టేషన్‌కు ఓ చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లింది. సిబ్బంది తనిఖీ చేస్తున్న లైన్లో బాలిక పేరెంట్స్ నిల్చున్నారు. అదే సమయంలో చిన్నారి లగేజీ చెకింగ్ చేసే ఎక్స్‌రే స్కానింగ్ మెషీన్‌లో దూరింది. అవతలివైపు నుంచి బయటకు వచ్చేసింది. చిన్నారి చేసింది సరదా పని కానీ, ఆ బాలిక చేష్టలకు సిబ్బంది ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటివి ప్రమాదకరమని అనంతరం బాలిక తల్లిదండ్రులకు రైల్వేస్టేషన్ సిబ్బంది క్లాస్ తీసుకున్నారు. కాగా, గతంలో ఓ మహిళ సైతం ఇలాగే చేసింది. తన హ్యాండ్ బ్యాగ్‌ను కాజేస్తారన్న భయంతో మెషీన్‌లో దూరి అవతలివైపు నుంచి బయటకు వచ్చిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. రైల్వేష్టేషన్లు, ఎయిర్‌పోర్టులలో ఉండే ఎక్స్ రే మెషీన్లు 1 మిలియర్డ్ రేంజ్‌లో రేడియేషన్ విడుదల చేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటివి చేయడం చాలా ప్రమాదకరం అని అధికారులు హెచ్చరించారు.