పాకిస్తాన్ కు మన నదులు ప్రవహించకుండా....

SMTV Desk 2019-02-22 13:12:45  

ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడి వల్ల భారతీయులు పాకిస్తాన్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం గతంలో పాకిస్తాన్ కు కల్పించిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్‌ను ఉపసంహరించుకుంది. తదనంతరం సింధు నది జలాలను కూడా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్నీ గురువారం జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కారీ ప్రకటించారు.

అయితే, ఈ నియమాన్ని అమలు చేయాలంటే కనీసం 6 సంవత్సరాలైన పట్టొచ్చని, అప్పటిలోగా నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి 100 మీటర్ల ఎత్తయిన డ్యామ్‌లను నిర్మిస్తామని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో 1960 నాటి ఒప్పందం ఉల్లంఘనకు గురవదని, మన దేశానికి దక్కాల్సిన న్యాయబద్ధ హక్కుల్ని కల్పించినట్లవుతుందని గడ్కారీ పేర్కొన్నారు.

భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఆరు నదుల నీటిని పంచుకునేందుకు - సింధూ, చీనాబ్, జీలం, బియాస్, రవి మరియు సట్లేజ్ 1960 లో సంతకం చేసిన రెండు దేశాలతో ఒక ఒప్పందం చేత పాలించబడుతుంది. తొమ్మిది సంవత్సరాల చర్చల తరువాత మధ్యవర్తిత్వంతో భారత దేశం, పాకిస్తాన్ ల నడుమ ఏర్పడ్డ నీటి పంపిణీ ఒప్పందం.

ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులు మూడు - బియాస్, రావి, సట్లెజ్ లపై భారతదేశానికి, మూడు పశ్చిమ నదులు - సింధు, చీనాబ్, ఝీలంలపై పాకిస్తాన్‌కూ నియంత్రణ ఉంటుంది.1960లో ఒప్పందం అమలులోకి వచ్చిన నాటి నుంచి, భారత దేశం, పాకిస్తాన్లు జలాల గురించి యుద్ధంలోకి వెళ్ళలేదు. అనేక విభేదాలు, వివాదాలు ఒప్పందం పరిధిలోని న్యాయపరమైన పద్ధతుల్లోనే పరిష్కరించుకున్నారు.

పాకిస్తాన్‌కు ప్రవహిస్తున్న నీటిని ఆపి కశ్మీర్, పంజాబ్‌ రాష్ట్రాలకు మళ్లించాలని యోచిస్తున్నారు. పాకిస్తాన్‌కు భారత జలాలను నిలిపివేయాలని రెండు నెలల క్రితమే నిర్ణయించామని, గడ్కారీ అదే సంగతిని తాజాగా పునరుద్ఘాటించారని మరో సీనియర్‌ అధికారి తెలిపారు.