భారత్‌పై ట్రంప్‌ విమర్శలు ..

SMTV Desk 2019-01-25 17:09:06  Donald trump, America president, India, Tax, Harley Davidson, Whiskey, Paid tax

వాషింగ్టన్‌, ​​జనవరి 25: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ భారత్‌తో అత్యంత సముచితమైన వొప్పందం కుదిర్చానని అన్నారు. కేవలం రెండు నిమిషాలు మాట్లాడి హార్లే డేవిడ్‌సన్‌ మోటార్‌ సైకిల్‌పై వున్న టాక్స్ లను తగ్గించగలిగానని వెల్లడించారు. కాగా అమెరికా విస్కీపై భారత్‌లో భారీగా టాక్స్ లు విధించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ చేయడంతో అమెరికాకు చెందిన హార్లే డేవిడ్‌సన్‌ బైక్ లపై ఉన్న టాక్స్లను భారత ప్రభుత్వం 50 శాతం తగ్గించింది. టాక్స్ లు ఎక్కువగా ఉండటంతో ట్రంప్‌ హెచ్చరించారు. భారత్‌ నుంచి దిగుమతి చేసుకొనే టూ వీలర్ వాహనాలపై పన్ను పెంచుతామని బెదిరించారు.అమెరికా వైట్‌హౌజ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ పరస్పర వాణిజ్య చట్టంపై వున్న విషయాలని ప్రస్తావించారు . ఇతర దేశాల్లో విధిస్తున్న పన్నులపై ఉదాహరణలు ఇచ్చారు. ఇండియాలో టూ వీలర్ వెహికల్ దిగుమతి టాక్స్ 100 శాతం పన్ను ఉండేది. కేవలం రెండు నిమిషాలు మాట్లాడి దానిని 50 శాతానికి తగ్గించాను. అయినప్పటికీ ఇది 50 శాతం వర్సెస్‌ 2.4 శాతంగా ఉంది. మిగిలినవన్నీ పక్కన పెడితే ఇది సముచితమైన వొప్పందమే అని ట్రంప్‌ అన్నారు. దిగుమతి చేసుకుంటున్న మద్యంపైనా భారత్‌ భారీగా టాక్స్ లు విధిస్తోందని ట్రంప్‌ విమర్శించారు. ‘భారత్‌లో అధికంగా పన్నులు ఉన్నాయి. అక్కడ వేర్వేరు పన్ను విధిస్తారు. విస్కీనే చూడండి.. 150 శాతం టాక్స్ వేశారు. దానివల్ల మనకేమీ రావడం లేదు అని ట్రంప్‌ అన్నారు.