నేడు ప్రముఖ గాయని చిత్ర పుట్టినరోజు

SMTV Desk 2017-07-27 18:44:01  chithra, birthday, july 27, sindhu bairavi

హైదరాబాద్, జూలై 27: 1963 జూలై 27న కేరళలోని తిరువనంతపురంలోని సంగీతకారుల కుటుంబంలో జన్మించారు చిత్ర. 1979లో ఎం.జి.రాధాకృష్ణన్ మలయాళ సినీ నేపథ్యగానానికి చిత్రను పరిచయం చేశారు. "దక్షిణ భారత నైటింగేల్" అని బిరుదందుకున్నారు చిత్ర. ఈమె మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ మరియు బెంగాలీ బాషలలో పాటలు పాడారు. 1986 లో సింధు భైరవి తో సంగీత దర్శకుడు ఇళయరాజా నేతృత్వములో చెన్నైలోని తమిళ సినిమా రంగములో అడుగుపెట్టింది. అంతేకాకుండా ఉత్తమ నేపథ్య గాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 15 అవార్డులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుండి 9 అవార్డులు, తమిళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 4 అవార్డులు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము నుండి 2 అవార్డులు అందుకొన్నది. ఈ విధంగా దక్షిణ భారతదేశములోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారాలందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించారు. 30 సంవత్సరాలలో 25 వేలకు పైగా పాటలు పాడిన మొట్టమొదటి గాయనిగా పేరు తెచుకున్నారు చిత్ర. కాగా ఈ రోజు చిత్ర పుట్టినరోజు సందర్బంగా సినీ పరిశ్రమలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.