ఈ సాలీడు కుడితే ఇక అది కష్టమే...!!!

SMTV Desk 2018-12-29 14:13:17  Spider bite, Canada, Black spider, Urine

కెనడా, డిసెంబర్ 29: కెనడా దేశ ప్రజలను ఓ వింత సాలీడు భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఈ మధ్య ఈ సాలీడు కాటుకి గురైన ఓ వ్యక్తి తీవ్ర నరకాన్ని అనుభవించాడు. ఓ వ్యక్తి తన ఇంటి బయట అటు ఇటు నడుస్తున్న క్రమంలో ఓ సాలీడు కుట్టింది. అది కుట్టిన దాదాపు రెండు గంటల తర్వాత అతనికి సాలీడు కుట్టిన చోట విపరీతమైన మంట వచ్చింది. అప్పటి నుండి అతనికి తన మూత్రాశయం నిండినా కాని మూత్రం బయటకి రావడం లేదు. దీంతో అతని పొట్ట విపరీతంగా ఉబ్బిపోయింది. అంతేకాక బీపీ కూడా పెరిగిపోయింది. ఇది గమనించిన తన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్ళారు.

అక్కడి డాక్టర్లకు ఆ వ్యక్తి తనను సాలీడు కుట్టింది అని చెప్పినా వారు వినిపించుకోకుండా ఏదో కిడ్నీ సమస్యగా భావించి చిన్నపాటి ట్రీట్ మెంట్ ఇచ్చి ఇంటికి పంపారు. కాని రాత్రి అతనికి మళ్ళీ విపరీతమైన పొట్ట నొప్పి రావడంతో మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాడు. అతనికి ఆ సమయంలో వొళ్ళంతా చెమటలు పట్టడంతో డాక్టర్లు ఆశ్చర్యపోయి నల్ల సాలీడు ప్రభావాలను స్టడీ చేశారు. దీంతో వారికి కన్ఫర్మ్ కావడంతో అతనికి యూరినరీ రిటెన్సన్ ట్రీట్ మెంట్ చేశారు. నల్ల సాలీడు కుట్టడం వల్లే ఇతనికి ఇలా జరిగిందని డాక్టర్లు నిర్దారించారు.