ఆగస్టు 4న విడుదల కానున్న " దర్శకుడు"

SMTV Desk 2017-07-27 12:06:56   darshakudu, sukumar, Ashok, kumari 21f, esha, sai karthik

హైదరాబాద్, జూలై 27: క్రియేటివ్ డైరెక్టర్ గా అందరి ప్రశంసలు అందుకుంటున్న దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలిచిత్రం" కుమారి 21 ఎఫ్" ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సుకుమార్ నిర్మాతగా తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘దర్శకుడు’. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు లో విడుదల కానుంది అని సమాచారం. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మీడియా తో మాట్లాడుతూ.... ప్రేమకు, తపనకు మధ్య నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథ ఇది. స్వార్థపరుడైన దర్శకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుందనేది. ఈ సినిమాలో ఆసక్తిని రేకెత్తిస్తుంది అని తెలిపారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో పాటు సెన్సార్ సభ్యుల నుండి మంచి కాంప్లిమెంట్స్ రావడం ఎంతో సంతోషంగా వుంది . ఈ తరహాలో చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారంటూ క్లీన్ యు సర్టిఫికెట్ ఇచింది. సెన్సార్ బోర్డ్. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపారు. అశోక్, ఇషా,పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సాయికార్తీక్ సంగీతం అందించారు.