సాంటా క్లాజ్‌గా అమెరికా మాజీ అధ్యక్షుడు

SMTV Desk 2018-12-20 14:22:33  Santa clause, Barak obama, American former president

వాషింగ్టన్, డిసెంబర్ 20: అగ్ర రాజ్యమైన అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్‌ వొబామా సాంటా క్లాజ్‌ వేషంలో వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆశ్యర్యపరిచారు. క్రిస్మస్‌ వేడుక సందర్భంగా వాషింగ్టన్‌లోని హాస్పిటల్‌కు సాంటా తరహాలో ఆయన వెళ్లారు. ఆ హాస్పిటల్‌ సిబ్బందికి వొబామా శుభాకాంక్షలు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులకు బహుమతలు ఇచ్చారు. అమెరికాకు 44వ అధ్యక్షుడిగా చేసిన వొబామా వాషింగ్టన్‌లోనే ఉంటున్నారు. గతేడాది కూడా ఇలానే సాంటా వేషంలో వచ్చి స్కూలు పిల్ల్లలను ఆశ్చ్యర్య పరిచారు.