పాక్ జైలు నుండి విడుదలకాబోతున్న హమీద్

SMTV Desk 2018-12-17 19:01:55  Hameed nihal ansari, Pakisthan jail

ఇస్లామాబాద్, డిసెంబర్ 17: గత 6 సంవత్సరాల నుండి పాకిస్థాన్‌లోని పెషావర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత జాతీయుడు హమీద్ నిహల్ అన్సారీ కారాగారం నుంచి విడుదలకానున్నాడు. 2012 నుంచి జైలులో ఉన్న హమీద్‌ను పాక్ అధికారులు రేపు పంజాబ్‌లోని వాఘా సరిహద్దు గుండా హమీద్‌ను భారత్‌కు పంపించనున్నారు. ముంబయికి చెందిన 33ఏళ్ల అన్సారీ 2012 నుంచి పాక్ అదుపులో ఉన్నాడు. భారత గూఢచారి అని ముద్రవేసిన పాక్ అతనికి శిక్ష వేసి జైలుకు పంపింది. అతని శిక్షా కాలం ఈనెల 15తో ముగిసింది. అన్‌లైన్లో పరిచయమైన అమ్మాయిని కలిసేందుకు నిహల్ అఫ్గనిస్థాన్ నుంచి అక్రమంగా పాక్‌కు వెళ్లాడు. అక్రమంగా చొరబడిన అతన్ని ఆదేశ భద్రతా సిబ్బంది 2012లో అరెస్ట్ చేసింది. నకిలీ పాకిస్థానీ గుర్తింపు కార్డు కలిగి ఉన్నందుకు డిసెంబర్ 15, 2015లో ఆదేశ మిలిటరీ కోర్టు అతనికి మూడేళ్ల శిక్ష విధించింది.