కోవింద్ కు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా

SMTV Desk 2017-07-21 16:09:17  america, india, president, ramnathkovindh

వాషింగ్టన్, జూలై 21 : రాష్ట్రపతి ఎన్నికలలో తన సత్తా చాటుకున్న రామనాథ్ కోవింద్ కు అందరి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా భారత 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన కోవింద్‌కు అగ్రరాజ్యం అమెరికా శుభాకాంక్షలు తెలిపింది. కోవింద్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు అమెరికా దేశం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య బంధం మరింతగా బలపడేలా, సఖ్యత పెరిగేలా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత్‌, అమెరికా చక్కటి స్నేహబంధంతో అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని పేర్కొన్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రతినిధి న్యూయర్ట్‌.. ఈ బంధం మరింత బలోపేతం కావాలని ఈ సందర్భంగా రామనాథ్ కు శుభాకాంక్షలు తెలిపారు.