మరోసారి పాక్‌ కాల్పుల వర్షం

SMTV Desk 2017-07-20 18:27:39  PAAKISTAN, AARMY, JAMMU KASHMEER,

జమ్ముకశ్మీర్, జూలై 20 : పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడింది. పూంచ్‌-రాజౌరీ బెల్టులోని జనావాసాలపై ఆటోమేటిక్‌ ఆయుధాలు, మోర్టార్లతో విరుచుకుపడింది. ఈ దాడిని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. బాలాకోట్‌, ధార్‌, లంబీబరీ, రాజ్‌ధాని, మాన్‌ కోట్‌, సందోట్‌ ప్రాంతాల్లో పాక్‌ సైనికులు కాల్పులు జరిపారు. పాక్‌ దుశ్చర్యల వల్ల స్కూల్‌ పిల్లలతో సహా 8 వేల మందికి పైగా గాయాలపాలయ్యారు. 217 మంది విద్యార్థులను, 15 మంది టీచర్లను భద్రతా సిబ్బంది కాపాడారు. మరో వైపు భారత్‌పైనే ఆరోపణలు చేస్తున్న పాక్‌, భారత సైనికుల కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించారంటూ భారత డిప్యూటీ హైకమిషనర్‌ జేపీ సింగ్‌ను పిలిపించి నిరసన వ్యక్తం చేస్తుంది.