ఇల్లు తెచ్చిన తంటా

SMTV Desk 2017-07-19 17:43:31  kenadaa, amerikaa, border, house, agents, house designing, change

కెనడా, జూలై 19 : ఒక దేశం వెళ్ళాలంటే కచ్చితంగా పాస్‌పోర్టు.. వీసా లాంటి అనుమతి పత్రాలు కావాల్సి ఉంటుంది. మరి రెండు దేశాల్లోనూ పౌరసత్వం పొందాలంటే దానికి చాలా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కాని ఇక్కడ ఎలాంటి నిబంధనలు లేకుండానే రెండు దేశాల్లోనూ పౌరసత్వం పొందవచ్చు అదెలా అంటే... ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఓ ఇళ్లు అమెరికాలోని వెర్‌మోంట్‌.. కెనడాలోని క్యుబెక్‌ సరిహద్దులో ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ ఇంటి వెనుక గేటు అమెరికాలో ఉంటే.. ముందు గేటు కెనడాలో ఉంటుంది. అనగా ఈ ఇంటికి ఒక గేటు నుంచి వచ్చి మరో గేటు నుంచి బయటకు వెళ్తే ఏకంగా దేశం దాటేయొచ్చన్నమాట. దీంతో ఆ ఇంట్లో నివసించే వారికి ఈ రెండు దేశాల్లోనూ పౌరసత్వం లభించింది. కాని ఆ ఇంటి యజమానులు బ్రియాన్‌.. జోన్‌ డుమౌలిన్‌ దంపతులు మాత్రం కెనడాలో స్థిరపడాలని అనుకుంటున్నారు. దీంతో ఆ ఇంటిని అమ్మాల్సి వస్తుంది. పాతకాలం ఇల్లు కావడంతో దాని డిజైన్‌లో మార్పు చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆ ఇంటి ధర రూ.71లక్షలు ఉండగా దాని మరమ్మత్తుకు ఇంకా ఎక్కువ ఖర్చు కానుంది. అయినా ఆ ఇంటి అమ్మకానికి అమెరికా.. కెనడా దేశాలకు చెందిన హౌస్‌ ఏజెంట్లు ముందుకొస్తున్నారట. కాని ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు వచ్చే వారు ఇంటి వెనక గేటు నుండి వచ్చి ఇంటి ముందు నుండి వెళ్తుండడంతో అక్కడి సరిహద్దు భద్రతా సిబ్బంది వాళ్లని అడ్డగిస్తున్నారట. ఆ బ్రియాన్‌ దంపతులు వివరణ ఇవ్వడంతో వదిలేస్తున్నప్పటికీ ఇంటి అమ్మకానికి ఇది ఒక ఇబ్బందిగా మారిందని ఆ దంపతులు చెబుతున్నారు