దేవదాస్ సీక్వల్

SMTV Desk 2018-09-22 10:28:44  Devadas , Nagarjuna, Nani, Devadas Sequel,

నాగార్జున, నాని మల్టీస్టారర్ మూవీగా వస్తున్న దేవదాస్ ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. గురువారం సాయంత్రం ఈ సినిమా ఆడియో రిలీజ్ చేశారు. ఆడియో వేడుకలో భాగంగా నాగార్జున నాని మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎన్నాళ్ల నుండో నానితో నటించాలని అనుకుంటున్నా అది దేవదాస్ తో కుదిరింది. నాని ఈ సినిమాలో నటించినందుకు థ్యాంక్స్ అంటూ నాగార్జున మాట్లాడటం జరిగింది. అంతేకాదు నాని ఒప్పుకుంటే ఈ సినిమా సీక్వల్ తీసేందుకు తాను రెడీ అంటున్నాడు నాగార్జున. వైజయంతి మూవీస్ బ్యానర్ లో శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న దేవదాస్ సినిమాను అశ్వనిదత్ నిర్మించారు. ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఆడియో వేడుకలో నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తుంది.